అసెంబ్లీలో కునుకు తీసిన ఎమ్మెల్యే

by Javid Pasha |   ( Updated:2023-02-06 12:09:30.0  )
అసెంబ్లీలో కునుకు తీసిన ఎమ్మెల్యే
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: మంత్రి హరీష్ రావు చాలా సీరియస్ గా రాష్ట్ర బడ్జెట్ పద్దులను అసెంబ్లీలో వివరిస్తుంటే ఆయన వెనక కూర్చున్న ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే కునుకు తీస్తున్నట్టుగా కనిపించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర బడ్జెట్ లో ఏఏ పద్దుల కింద కెటాయింపులు జరిగాయి. ప్రణాళికేతర వ్యయం, ప్రణాళిక వ్యయం తదితర వివరాలను సభకు కులంకశంగా మంత్రి హరీష్ రావు చదివి వినిపిస్తున్న క్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే తన సీట్లో హారామ్ చేస్తూ నిద్రపోతున్నట్టుగా లైవ్ లో కనిపించింది. దీంతో నెటిజన్లు ఎమ్మెల్యే తీరును విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. జగిత్యాలలో ప్రత్యర్థి పార్టీల నాయకులు ఇందుకు సంబందించిన స్క్రీన్ షాట్లను నెట్టింట వైరల్ చేస్తున్నారు. అసెంబ్లీలో పడుకున్న మా ఎమ్మెల్యే అంటు కొందరు, అత్యంత ముఖ్యమైన సమావేశం రోజే ఇలా అయితే ఎలా అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

బడ్జెట్ కూర్పు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీష్ రావులు శ్రమ పడ్తారు కానీ మా ఎమ్మెల్యే కూడా ఇందులో తనవంతు బాధ్యతలు నిర్వర్తించారా అందుకే అసెంబ్లీలోనే కునుకు తీశారా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు నెటిజన్లు. ఏది ఏమైనా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరో సారి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.


Advertisement

Next Story