రేవంత్ పాలన చూసే కాంగ్రెస్‌లోకి BRS ఎమ్మెల్యేలు: రామ్మోహన్ రెడ్డి

by Satheesh |   ( Updated:2024-07-20 16:58:40.0  )
రేవంత్ పాలన చూసే కాంగ్రెస్‌లోకి BRS ఎమ్మెల్యేలు: రామ్మోహన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 28న నేవీ రైడర్ స్టేషన్‌ను ప్రారంభించబోతున్నామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన సెక్రటేరియట్లో మీడియాతో మాట్లాడుతూ.. దేశానికి పనికి వచ్చే ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం ఏడేళ్ల నుంచి పెండింగ్‌లో పెట్టిందన్నారు. సైన్యానికి పనికొచ్చే ప్రాజెక్టులోనూ బీఆర్ఎస్ రాజకీయం చేయాలని చూసిందన్నారు. కాంట్రాక్టులు ఇవ్వాలి, కోట్లు దండుకోవాలనే సూత్రంతో బీఆర్ఎస్ ముందుకు వెళ్లిందని, అందుకే ప్రజలు బుద్ధి చెప్పారని విమర్శించారు. ఇక బీఆర్ఎస్ నాయకులు స్పీకర్‌ని కలిసి వినతి పత్రాలు ఇచ్చి రాజకీయం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నాయకులు స్వచ్ఛందంగా వస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పార్టీ మారుతున్నారన్నారు. వాళ్ల నియోజకవర్గాల అభివృద్ధి చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారన్నారు. రేవంత్ సర్కార్ ప్రజా సంక్షేమ పాలన చూసి ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story