ట్యాంక్‌బండ్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనం ఆనవాయితీ.. ఇప్పుడు వద్దంటే ఎలా: ఎమ్మెల్యే రాజాసింగ్

by Mahesh |
ట్యాంక్‌బండ్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనం ఆనవాయితీ.. ఇప్పుడు వద్దంటే ఎలా: ఎమ్మెల్యే రాజాసింగ్
X

దిశ, వెబ్ డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వినాయక నిమజ్జనాలపై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి ట్యాంక్ బండ్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదని.. పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు ట్యాంక్ బండ్ పై ఎక్కడిక్కడ ఐరన్ కంచే తో పాటు ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఈ ఇష్యూపై ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. ట్యాంక్‌బండ్‌లో నిమజ్జనంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని.. నగర ప్రజలకు ట్యాంక్‌బండ్‌లో గణేష్‌ విగ్రహాల నిమజ్జనం ఆనవాయితీగా వస్తుందన్నారు. నిజంగా హైకోర్టు ఆదేశాలు అమలు చేస్తే.. గణేష్ విగ్రహాలను ఎక్కడ నిమజ్జనం చేయాలని రాజాసింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా ఈ ఇష్యూపై ఈ రోజు హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. ట్యాంక్ బండ్ లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై నిషేధం విధిస్తూ గత సంవత్సరం హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని.. చెరువుల పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతి వాదిగా హైడ్రాను చేర్చాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషన్ ను కొట్టివేసింది. అలాగే నిమజ్జనంపై 2021లో ఇచ్చిన తీర్పు కొనసాగుతుందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed