BRS MLA : మాజీ సర్పంచులంటే ఎందుకంత కోపం ప్రభుత్వానికి : మాజీ మంత్రి

by Ramesh N |
BRS MLA : మాజీ సర్పంచులంటే ఎందుకంత కోపం ప్రభుత్వానికి : మాజీ మంత్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో గత పదేళ్లుగా గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచ్‌లు ఆందోళనలు చేపట్టారు. ఇవాళ వారు సీఎం రేవంత్‌కు వినతి పత్రం ఇవ్వాలని అనుకున్న నేపథ్యంలో వారిని పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టులు, నిర్భంధాలు చేశారు. దీనిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి MLA Prashant Reddy స్పందించారు. ప్రజా పాలన చెప్పుకుంటున్న కాంగ్రెస్, CM Revanth reddy రేవంత్ సర్కార్ ఉదయం 4 గంటలకే మాజీ సర్పంచ్ లను అక్రమంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లలో బందించడం హేమమైన చర్య అని ఆరోపించారు. మాజీ సర్పంచ్ లను అక్రమ అరెస్టులను మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పది నెలల కింద అప్పులు తెచ్చి పనులు చేసిన వాటికి బిల్లులు అడిగితే అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని అన్నారు.

వారు ప్రజలకు పని చేసిన దానికే డబ్బులు ఇవ్వమంటే ఈ ప్రభుత్వానికి ఎందుకింత కోపమొస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్‌కు మాజీ సర్పంచులంటే ఎందుకింత కోపమని నిలదీశారు. బిల్లులు చెల్లింపు చేయకుండా సర్పంచులను ప్రభుత్వం వేధిస్తోంది, భయపెడుతోందని ఆరోపించారు. మాజీ సర్పంచుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, అంతేకాదు ఇవాళ అక్రమంగా అరెస్ట్ చేసిన మాజీ సర్పంచులను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed