కేటీఆర్.. మహిళలు అంటే అంత చులకనా..? : ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి

by M.Rajitha |
కేటీఆర్.. మహిళలు అంటే అంత చులకనా..? : ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : మాజీ మంత్రి కేటీఆర్ కు మహిళలు అంటే అంత చులకనా? అంటూ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆయన మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా భవిష్యత్ లో ఎవరూ ఇలా వ్యవహరించకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ ల్లో భాగంగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందిస్తున్నామన్నారు. దీనిని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందు పరిచామన్నారు. దీన్ని మహిళలంతా స్వాగతించారన్నారు. కానీ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.

Next Story

Most Viewed