- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- Bigg Boss Telugu 8
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
పవన్ కళ్యాణ్ అభిమానులారా ఊపిరి పీల్చుకోండి.. ఎట్టకేలకు ఆ సినిమా విడుదల తేదీ ప్రకటన
దిశ, వెబ్డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) నటిస్తున్న సినిమాల్లో ‘హరి హర వీర మల్లు’ ( Hari Hara Veera Mallu)ఒకటి. క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ నుంచి తాజాగా చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. అలాగే ఈ రోజు ఉదయం 7గంటలకు విజయవాడలో కొత్త షెడ్యూల్ షూటింగ్ మొదలైందని, పవన్ కళ్యాణ్ కూడా జాయిన్ అవతారని తెలిపారు. ఎన్నికలు, రాజకీయాల కారణంగా కొంతకాలంగా సినిమా షూటింగ్లకు దూరంగా ఉన్న పవన్.. నేటితో షూటింగ్లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
కాగా లెజెండరీ నిర్మాత ఏఎం రత్నం(AM Rathnam) సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్(Mega Surya Productions) పతాకంపై ఎ.దయాకర్ రావు(A. Dayakar Rao) ఈ మూవీని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(Bobby Deol), లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్(Anupam Kher) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి(MM Keeravani) సంగీతాన్ని అందిస్తున్నారు. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ మూవీని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తొలి భాగాన్ని స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల చేయనున్నారు. ధర్మం కోసం యుద్ధం అనేది ఉపశీర్షిక.