- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘నో డౌట్.. నేరమే..’ చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడంపై సుప్రీం కోర్టు
దిశ, వెబ్‌డెస్క్: చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం ముమ్మాటికీ నేరమేనని దేశ అత్యున్నత ధర్మాసనం తేల్చి చెప్పింది. చైల్డ్ పోర్నోగ్రఫీ (Child Pornography) చూడడం తప్పు కాదంటూ జనవరి 11న మద్రాస్ హై కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు (Supreme Court) ఈ రోజు (సోమవారం) తుది తీర్పు వెలువరించింది. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడం కచ్చితంగా పోక్సో చట్టం (Pocso Act) పరిధిలోని నేరమేనని చెప్పుకొచ్చింది. ఈ మేరకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపారేసింది. అంతేకాకుండా మద్రాస్ హైకోర్టు (Madras High Court) తీర్పును జారీ చేయడంలో ఘోర తప్పిదం చేసిందంటూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అలాగే, పోక్సో చట్టం సెక్షన్ 15 ప్రకారం.. చైల్డ్ పోర్నోగ్రఫీ మెటీరియల్‌ను (ఫొటోలు, వీడియోలు) వీక్షించడం మాత్రమే కాదు సేవ్ చేసుకుని దగ్గర పెట్టుకోవడం కూడా నేరమేనని చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.
కాగా.. చైల్డ్ పోర్న్ వీడియోలని డౌన్‌లోడ్ (Download) చేసుకున్న ఓ 28 ఏళ్ల యువకుడి కేసులో జనవరి 11న తీర్పు వెలువరించి మద్రాస్ హైకోర్టు.. నిందితుడు ఆ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకున్నాడేకానీ, ఎవ్వరికీ షేర్ చేయలేదని, ఎవరిపై అఘాయిత్యానికి పాల్పడలేదని, అందువల్ల అతడిపై ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. దీంతో నిందితుడికి ఊరట లభించింది. కానీ తాజా తీర్పులో సదరు నిందితుడిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ కొనసాగించాలని సుప్రీం తీర్పునిచ్చింది. చివరిగా న్యాయస్థానాల్లో ఇకపై చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని ఉపయోగించొద్దని, దాని బదులుగా చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ (CSEAM) అనే పదాన్ని వాడాలని సూచనలు జారీ చేసింది.