Allu Arjun: ‘పుష్ప-2’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. సోషల్ మీడియా షేక్

by Hamsa |
Allu Arjun: ‘పుష్ప-2’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్.. సోషల్ మీడియా షేక్
X

దిశ, సినిమా: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న తాజా మూవీ పుష్ప-2. అయితే ఈ సినిమా ఇండియాను షేక్ చేసిన పుష్పకు సీక్వెల్‌గా రాబోతుంది. ఇందులో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటిస్తోంది. ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అంచనాలను రెట్టింపు చేయడంతో పుష్ప-2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ విడుదల కాలేదు.

పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ మూవీ నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఇగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, పుష్ప-2 నుంచి చిత్రబృందం అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. అలాగే విడుదలకు 75 రోజులు మిగిలి ఉందని పోస్టర్‌ ద్వారా తెలిపారు.

Next Story

Most Viewed