అల్లూరి జిల్లాలో బుల్లి టొర్నడో.. భయపడ్డ గిరిజనులు.. కానీ కాసేపటికే..!

by karthikeya |   ( Updated:2024-09-23 08:23:00.0  )
అల్లూరి జిల్లాలో బుల్లి టొర్నడో.. భయపడ్డ గిరిజనులు.. కానీ కాసేపటికే..!
X

దిశ, వెబ్‌డెస్క్: మేడారం అడవిలో లక్ష చెట్ల వరకు నేలకొరగడానికి టొర్నెడోయే కారణమని అంతా అనుకుంటున్న టైంలో.. తాజాగా మరో సుడిగాలి భీభత్సం సృష్టించింది. దీనికి సంబంధించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లూరి జిల్లా, అరకు ఏజెన్సీలోని పొలాల్లో ఈ సుడిగాలి సంభవించింది. డుంబ్రిగూడ మండలం దేముడువలస- కొరొంజ్‌గూడ పొలాల్లో వేగంగా సుడులు తిరుగుతూ పొలంలోని నీటిని పైకి ఫౌంటెయిన్‌లా చిమ్ముతూ అందరినీ భయపెట్టింది. కొద్ది సేపు అక్కడే నీటిని చిమ్ముతూ తిరిగి ఆ తర్వాత శాంతించింది. దీంతో అక్కడి గిరిజనులు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉంటే ఇది చిన్న సైజు టొర్నడోలాంటిదేనని నిపుణులు చెబుతున్నారు. అమెరికా లాంటి మైదాన ప్రాంతాల్లో ఈ టొర్నడోలు సంభవించి.. భారీ నష్టాన్ని మిగుల్చుతుంటాయని వివరించారు. ఇక మన దేశంలో పెద్ద పెద్ద పర్వతాలు, లోయలు ఉండడం వల్ల టొర్నడోలు వచ్చే అవకాశం చాలా తక్కువని అంటున్నారు. అంతేకాకుండా అమెరికాలో భారీగా చల్లని గాలులు వీయడం వల్ల గాలి పీడనంలో మార్పులు సంభవించి టొర్నడోలు ఏర్పడతాయని, కానీ మన దేశ హిమాలయాలు.. అలాంటి గాలులు రాకుండా అడ్డుకుంటున్నాయి. అందువల్ల భారత్‌లో టోర్నడోలు వచ్చే ఛాన్స్ చాలా తక్కువని వివరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed