Padi Koushik Reddy : అది నిరూపిస్తే దేనికైనా సిద్ధమే.. రెండు పార్టీలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్

by Rajesh |
Padi Koushik Reddy : అది నిరూపిస్తే దేనికైనా సిద్ధమే.. రెండు పార్టీలకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. అసెంబ్లీ మీడియా హాల్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, పది లక్షలకు పైగా ప్రైవేట్ ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసీఆర్ ప్రభుత్వం కన్నా ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇచ్చారని ఎవరు నిరూపించినా తాను దేనికైనా సిద్ధం అన్నారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న 2 లక్షల కొత్త ఉద్యోగాలు ఇచ్చి తీరాలన్నారు.

ఎన్నికలపుడు జాబ్ క్యాలెండర్‌పై రేవంత్, భట్టిల సంతకాలతో భారీ పత్రికా ప్రకటనలు ఇచ్చారని.. నిన్న నిరుద్యోగులు జాబ్ క్యాలండర్‌పై వేయి కళ్లతో ఎదురు చూశారని తెలిపారు. జాబ్ క్యాలెండర్ పేరిట ఉత్త పత్రాన్ని విడుదల చేసి నిరుద్యోగులను నిరాశ పరిచారని తెలిపారు. తాము నిరుద్యోగులపై మాట్లాడుతుంటే సీఎం దానం నాగేందర్‌ను రెచ్చగొట్టి బూతులు మాట్లాడించారని ఆరోపించారు. దానం నాగేందర్ హైదరాబాద్ లో మమ్మల్ని తిరగనివ్వం అంటున్నారు.. దానం ఎక్కడికి రమ్మన్నా వస్తా.. చూసుకుందామా అని చాలెంజ్ విసిరారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story