Mosquito coils: దోమల కాయిల్స్ వాడుతున్నారా.. ముందు ఈ విషయాలు తెలుసుకోండి

by Anjali |
Mosquito coils: దోమల కాయిల్స్ వాడుతున్నారా.. ముందు ఈ విషయాలు తెలుసుకోండి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి ఇంట్లో దోమల(Mosquitoes)సమస్య ఉంటుంది. సాప్రతి ఇంట్లో దోమల(Mosquitoes)సమస్య ఉంటుంది. సాయంత్రం అయితే చాలు ఇంట్లో తిరుగుతూ నస పెడుతుంటాయి. గది తలుపులు వేసినా ఓ పట్టాన వదలవనుకోండి. దోమలు కుడితే మళ్లీ పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలకు దారీ తీస్తుంది. కాగా దోమలకు చెక్ పెట్టాలని చాలా మంది దోమల తెర, అలౌట్స్(Alouettes), మెష్ డోర్స్ లాంటివి వాడుతుంటారు. అయినా కూడా ఏదో ఒక మూల నుంచి వస్తూనే ఉంటాయి. అలాగే చాలా మంది చాలా తక్కువ ధరకే లభిస్తాయని దోమల కాయిన్స్(Mosquito coils) కూడా వాడుతుంటారు. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తాజాగా వైద్య నిపుణులు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

దోమల కాయిన్స్ వాడటం వల్ల శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఎందుకంటే ఈ కాయిన్స్ లో డేంజరస్ కెమికల్స్(Hazardous chemicals) ఉంటాయి. కాగా ఆరోగ్యానికి హానికరం ఇవి. దీని నుంని వచ్చే పొగను పీల్చుతాము కాబట్టి శ్వాస వ్యవస్థ( respiratory system)పై ప్రభావం పడుతుంది. అలాగే కాయిన్స్ వాసన పడనివారికి తలనొప్పి వస్తుంది. వికారం, మైకం, స్కిన్ పై దద్దుర్లు, కంటి సమస్యలు అలర్జీలు వంటివి వస్తాయి. దీనిలోని కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులు రక్తంలో కరిగి హార్ట్ లోకి చేరి గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. లంగ్ కు సంబంధించిన వ్యాధులు తలెత్తుతాయి. కాయిన్స్ పొగ సిగరెట్ పొగతో సమానమంటున్నారు నిపుణులు.

దోమల కాయిన్స్ కారణంగా వచ్చే పొగ పీలిస్తే బ్రెయిన్ పై ఎఫెక్ట్(Effect on brain) పడుతుంది. మెదడు పనితీరు దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. కాగా దోమల్ని తరిమికొట్టేందుకు కాయిన్స్ ఉపయోగించకపోవడమే మంచిది అంటున్నారు. కాగా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే దోమలు రాకుండా ఉంటాయని.. నిల్వ నీరు లేకుండా చూసుకోండని సూచిస్తున్నారు. శరీరాన్ని కప్పి ఉంచే బట్టల్ని వాడమని, అలాగే దోమల బ్యాట్స్ వాడండని చెబుతున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed