- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూ సేకరణ పనులు వెంటనే పూర్తి చేయాలి
దిశ, గద్వాల కలెక్టరేట్ : నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంతో ఆయకట్టుకు నీరు అందించే విధంగా.. నిలిచిపోయిన భూసేకరణ పనులను చేపట్టి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో భూసేకరణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ప్యాకేజీ 99, 100 పరిధిలో మిగిలిపోయిన 488 ఎకరాలకు సంబంధించిన భూసేకరణ పనులను వెంటనే పునరుద్ధరించి ఆయకట్టుకు నీరందించే విధంగా పనులను చేపట్టాలని ఆదేశించారు. చేపట్టిన పనుల పురోగతిపై నెల రోజుల తర్వాత తిరిగి సమీక్షించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీనారాయణ, భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఈఈ రహీముద్దీన్, గద్వాల తహశీల్దార్ మల్లికార్జున్, ధరూర్ తహశీల్దార్ వెంకట్రావు, ఇరిగేషన్ శాఖ డీఈ లు, ఏఈ లు, సర్వేయర్లు, తదితరులు పాల్గొన్నారు.