- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతారం గ్రామంలో భగ్గుమన్న పాత కక్షలు
దిశ, కుల్కచర్ల : కుల్కచర్ల మండలం అంతారం గ్రామంలో మరోసారి పాత కక్షలు,భూతగాదాలు భగ్గుమన్నాయి. పిల్లోడిని బెదిరించారని అడిగేందుకు వెలితే ఆ కుటుంబం పై చిన్న పెద్ద తేడా లేకుండా కర్రలతో, ఇనుపరాడ్డు తో దాడిచేశారు. చెరణ్ అనే బాలుడు నీళ్లకోసం వెలితే చంపుతానని బెదిరించాడని తన ఇంట్లో తల్లి పావనికి వచ్చి చెప్పాడంతో ఆమె భర్త చంద్రమౌళితో విషయన్ని చెప్పింది. విషయం తెలియడంతో మరో వర్గానికి చెందినవారిని అడిగేందుకు వెళ్లారు. ఇరువర్గాల మద్య మాటామాటా పెరిగి చిలికి చిలికి గాలివానలా పెద్ద గొడవకు దారితీసింది. ఇదంతా పాత కక్షలు, భూతగాదాలు మనసులో పెట్టుకున్న రాములు,టిచర్ బసయ్యలు ఎలాగైనా చంద్రమౌళి కుటుంబీకులపై దాడి చెయ్యాలని నిర్ణయించుకున్నాకే మళ్ళీ వారి ఇంటికి వచ్చి దాడికి దిగారాని బాధితులు తెలిపారు.
ఈ ఘర్షణలో చంద్రమౌళి కుటుంబ సభ్యులు నారాయణమ్మ, చంద్రమౌళి,లావణ్య,అక్షయ,శ్రీకాంత్,చరణ్,వెంకటరాములు,పావని లపై మరో వర్గానికి చెందిన బసయ్య, రాములు, చెన్నయ్య, తిరుపతయ్య, అనిల్,శీను,నర్సింలు ఇనుపరాడ్లతో దాడి చేశారు. తీవ్ర గాయాలు కావడంతో బాధితులు ఆసుపత్రికి తరలి వెళ్లారు. పోలీసులకు విషయం తెలియడంతో సంఘటన స్థలానికి వెళ్లి దాడికి ఉపయోగించిన కర్రను,రాడును స్వాధీనపరుచుకున్నారు. బాధితులు చంద్రమౌళి కుటుంబ సభ్యులతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా దాడి చేసిన బసయ్య, రాములు, చెన్నయ్య, తిరుపతయ్య, అనిల్,శీను,నర్సింల పై కేసు నమోదు చేసుకొని కుల్కచర్ల ఎస్ఐ అన్వేష్ రెడ్డి తెలిపారు.