Matsyagiri : శ్రీమత్స్యగిరి బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కుంభం

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-06 08:04:20.0  )
Matsyagiri : శ్రీమత్స్యగిరి బ్రహ్మోత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కుంభం
X

దిశ, వెబ్ డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటాపురం శ్రీమత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(Sri matsyagiri Lakshminarasimha swamy Devasthanam) శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాల(Brahmotsavalu) ప్రచార పోస్టర్ ను భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి(Anil Kumar Reddy)ఆవిష్కరించారు. తన నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాల కరపత్రాలు, ఇన్విటేషన్ కార్డ్స్, గోడ పత్రికలను అనిల్ రెడ్డి ఆవిష్కరించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్.మోహన్ బాబు ఎమ్మెల్యే అనిల్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందచేసి శ్రీస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.

స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10నుంచి 15వ తేదీ వరకు జరుగనుండగా, 13న లక్ష్మీనరసింహుల కల్యాణోత్సం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో దేవస్థానం అర్చక, సిబ్బంది, దేవస్థానం మాజీ చైర్మన్ కొమ్మిరెడ్డి నరేష్ రెడ్డిలు పాల్గొన్నారు.

Advertisement

Next Story