చంద్రబాబు మళ్లీ తెలంగాణకు వచ్చేది అందుకే: జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2022-12-26 17:31:41.0  )
Jagga reddy criticizes cm kcr over his national politics
X

దిశ, తెలంగాణ బ్యూరో: చంద్రబాబు తెలంగాణకు రావడానికి కేసీఆర్​అవకాశం ఇచ్చారని, బీఆర్ఎస్​పేరుతో ఏపీకి కేసీఆర్​వెళ్తుంటే చంద్రబాబు తెలంగాణకు వస్తున్నారని టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​జగ్గారెడ్డి అన్నారు. సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్​పార్టీ నుంచి టీ తొలిగించి తెలంగాణను అవమానించారని, కేసీఆర్ ఏపీలో అట్రాక్ట్ చేయలేరు కానీ చంద్రబాబు తెలంగాణను అట్రాక్ట్ చేయగలరని అన్నారు. పార్టీ పేరు నుంచి తెలంగాణ తొలగించడంతోనే కేసీఆర్ బలం పోయిందని, సీఎంలో ఎక్కడో ఓ మూలన సమైక్య భావన ఉందన్నారు.

తెలంగాణ వాదాన్ని ముఖ్యమంత్రి చంపేశారని, రాజకీయ బ్రతుకునిచ్చిన చెట్టునే కేసీఆర్ నరికేశారన్నారు. కూటములు, పొత్తులపై ముందు ముందు తెలుస్తుందని, తెలంగాణలో ఇక సీరియస్ పాలిటిక్స్ నడుస్తాయని జగ్గారెడ్ది అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకకు బీఆర్ఎస్ వెళితే టీడీపీ కూడా వెళుతుందని, కేసీఆర్‌తో చంద్రబాబు ఆడుకుంటారని, బీఆర్ఎస్‌తో కేసీఆర్ సక్సస్ అయ్యే పరిస్థితి ఉండదన్నారు.

తెలంగాణ వచ్చాక మైనార్టీ లోన్స్ ఇవ్వడం లేదని, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వంద శాతం సబ్సిడీతో చిరు వ్యాపారులకు లోన్స్ ఇచ్చామని జగ్గారెడ్డి అన్నారు. ఇటీవల ప్రభుత్వం మైనార్టీ కార్పొరేషన్‌కు రూ. 120 కోట్లు కేటాయించిందని, ఆ డబ్బు ఏ మాత్రం సరిపోదని, కేవలం 1200 మందికి మాత్రమే సరిపోతాయన్నారు. మైనార్టీ కార్పొరేషన్‌కు కనీసం రూ. 1500 కోట్లు కేటాయించాలని, కార్పొరేషన్‌లో రుణాలకు అప్లికేషన్ గడువును జనవరి 5వ తేదీ వరకే విధించారని, మైనార్టీ కార్పొరేషన్ లోన్ దరఖాస్తు గడువును నెల రోజులకు పెంచాలని డిమాండ్​ చేశారు. దీనిపై సీఎం కేసీఆర్‌కు గతంలోనే లేఖ రాసినట్లు జగ్గారెడ్డి వెల్లడించారు.

Advertisement

Next Story