షర్మిలపై సీరియస్.. YS విజయమ్మకు MLA జగ్గారెడ్డి సలహా

by GSrikanth |
షర్మిలపై సీరియస్.. YS విజయమ్మకు MLA జగ్గారెడ్డి సలహా
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ సర్కార్‌పై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేసీఆర్ సర్కార్‌ ఎనిమిదేళ్లుగా విఫలం అవుతూనే ఉందని విమర్శించారు. ఆరోగ్య శ్రీ అమలు కావడం లేదని అనేకసార్లు విన్నవించినా సర్కార్ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మంత్రి హరీశ్ రావు ఆరోగ్య శ్రీ అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు. రూ.10 లక్షల బిల్లుకు కేవలం రూ.30 వేలే ఇస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కూతురు షర్మిల తనపై నిందలు వేడయం దురదృష్టకరమన్నారు. తాను కోవర్టునో.. కాదో తర్వాత చెబుతానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఎంత ట్రై చేసినా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకూ ఎవరి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నించినా దొరకడం లేదని, అయినా తనపై కోవర్టు అని ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

షర్మిల ఎన్ని పాదయాత్రలు చేసినా జీవితంలో నాయకురాలు కాలేదని ఎద్దేవా చేశారు. షర్మిల తల్లి విజయమ్మకు తానో సలహా ఇస్తానని, షర్మిలను ముఖ్యమంత్రి చేయాలనుకుంటే ఏపీలో జగన్‌కు నచ్చజెప్పి ఏపీ సీఎం సీటును షర్మిలకు ఇప్పించాలని హితవు పలికారు. ఏపీలో మూడు రాజధానుల గొడవ పక్కన పెట్టి, మూడు రాష్ట్రాలు చేసుకొని తల్లి, కొడుకు, కూతురు మూడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయిపోండి అని సెటైర్లు వేశారు. వైఎస్ కుటుంబ సభ్యుల గొడవకు రెండు రాష్ట్రాల పంచాయతీగా చూపించొద్దని అన్నారు. మరోసారి షర్మిల నామీద కామెంట్ చేస్తే.. ఇక తనను ఎవరూ ఆపలేరని హెచ్చరించారు. ఎవరు ఎంత మొత్తుకున్నా తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed