- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఛాన్సే లేదు.. సీఎం పదవిపై ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ప్రకటించిన బీసీ సీఎంపై ఆ పార్టీ కీలక నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. నన్ను బీసీ ముఖ్యమంత్రి అంటున్నారు.. నేను ఒక్క గజ్వేల్, హుజురాబాద్‌లో గెలిస్తే సీఎం అవుతానా అని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ 70 గెలిస్తే తప్ప తాను సీఎం అయ్యే ఆస్కారం లేదని అన్నారు. కాగా, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని చేస్తామని ఆ పార్టీ అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో బీసీ ఓటర్లు అధికంగా ఉండటంతో ఆ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకుని ఓట్లు రాబట్టేందుకు బీసీ వ్యక్తే సీఎం అని బీజేపీ అనౌన్స్ చేసింది. ప్రచారంలో సైతం బీజేపీ ఈ అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుతోంది. బీజేపీ అగ్రనేతలు సైతం ప్రచార సభల్లో ఈ అంశాన్ని హైలెట్ చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలకు అన్యాయం చేస్తే బీజేపీ మాత్రం ఎక్కువగా బీసీలకే టికెట్లు ఇచ్చిందని, అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని ప్రచారం చేస్తోంది.