ఒక్క గజ్వేల్ నియోజకవర్గంలోనే 30 వేల మంది కేసీఆర్ బాధితులు: ఈటల ఫైర్

by Satheesh |   ( Updated:2023-11-06 07:32:43.0  )
ఒక్క గజ్వేల్ నియోజకవర్గంలోనే 30 వేల మంది కేసీఆర్ బాధితులు: ఈటల ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ భూ దందాలకు పాల్పడుతున్నారని.. అసైన్డ్ భూములను కబ్జా చేశారని బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ల్యాండ్ పూలింగ్, అభివృద్ధి పేరిట బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల భూములు లాక్కుంటుందని అన్నారు. ఒక్క గజ్వేల్ నియోజకవర్గంలోనే 30 వేల మంది కేసీఆర్ బాధిత కుటుంబాలు ఉన్నాయని ఈటల మండిపడ్డారు.

తెలంగాణలో ప్రభుత్వమే స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని ఫైర్ అయ్యారు. పొరుగు రాష్ట్రాల్లో అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తుంటే.. తెలంగాణలో మాత్రం ఆ భూమలను లాక్కుంటున్నారని అన్నారు. భూములను లాక్కొని దళితులను రోడ్డున పడేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రభుత్వానికి ఎక్కడ భూములు అవసరమైనా అసైన్డ్ భూములను గుంజుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో 40, 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు హక్కులు ఇవ్వట్లేదని ఆరోపించారు.

Advertisement

Next Story