- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తనకు మద్దతు ఇస్తే.. తొక్కి పడేస్తానని మంత్రి హరీష్ రావు బెదిరిస్తుండు: ఈటల ఫైర్
దిశ, తెలంగాణ బ్యూరో: నేను గజ్వేల్‌లో కూడా పోటీ చేస్తున్నా.. గజ్వేల్‌లో నాకు సహకరించేందుకు వందలాది మంది నేతలు నిర్ణయం తీసుకున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ తెలిపారు. తనకు సహకరించే నేతలను హరీష్ రావు తొక్కిపడేస్తానని ఫోన్ చేసి బెదిరిస్తున్నారని ఈటల ఆరోపించారు. మంగళవారం హైదరాబద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నల్గొండ జిల్లాకు చెందిన నాయకులు బీజేపీ పార్టీలో చేరిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. హరీష్ రావుకు తొక్కి పడేసే శక్తి లేదని.. తొక్కిపడేసేది గజ్వేల్ ప్రజలని పేర్కొన్నారు.
ఓట్లు వేసుకుని అవకాశం ఉంటే నువ్వే గుద్దుకొనేవాడివేమో కానీ ఓట్లు వేసేది నువ్వు కాదు, నీ కుటుంబం కాదు, నీ కులం కాదని గజ్వేల్ ప్రజలని స్పష్టం చేశారు. కేసీఆర్ అహంకారం, దుర్మార్గపు పాలన అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. గజ్వేల్లో పేదల భూములు గుంజుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇస్తున్న దుర్మార్గపు వ్యవస్థ నడుస్తుందని ధ్వజమెత్తారు. ఆయన మండలంలో తప్ప ఎక్కడా రోడ్లు వెయ్యలేదన్నారు. గజ్వేల్ ప్రజల హృదయాల్లో కేసీఆర్ ఉన్నాడో మేము ఉన్నామో 2023 నవంబర్ 30న తేలిపోతుందన్నారు. ప్రజలారా మీకు బీజేపీ సంపూర్ణంగా మద్దతు ఉంటుందని ఈటల అన్నారు. మీడియాలో చూపించకపోయినా.. ప్రజాక్షేత్రంలో బీజేపీనే సరైన వేదిక అని భావిస్తున్నారని ఆయన తెలిపారు.
బీజేపీకి ఓటు వేయాలని కేసీఆర్‌ను ఒడగొట్టాలని ప్రజలు భావిస్తున్నారన్నారు. కేసీఆర్ డబ్బులతో ఎన్నికలు గెలవాలని చూస్తున్నారని, ఎమ్మెల్యే అభ్యర్థులకు పోలీసు పహారాలో ఇప్పటికే డబ్బులు పంపించారని ఆరోపించారు. బీజేపీ నాయకులకు వెలకట్టి కొనాలని చూస్తున్నారని.. తలకాయ కిందపెట్టి, కాళ్లు పైకి పెట్టినా ఈ సారీ కేసీఆర్‌కి ప్రజలు ఓటు వేయడానికి సిద్ధంగా లేరన్నారు. కాంగ్రెస్ గురించి తెలంగాణ సమాజానికి తెలుసని, వారి పాలనలో ఏం జరిగిందో అందరూ చూశారని చెప్పారు. తొమ్మిదేళ్ళ పాలనలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్.. కేసీఆర్ ఇచ్చిన అనేక హామీలు అమలు కాలేదని విమర్శించారు.