MLA Alleti: ఖాకీ బట్టలు వదిలేసి.. ఖద్దరు బట్టలేసుకోండి: రంగనాథ్‌పై ఏలేటి సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-08-29 12:07:37.0  )
MLA Alleti: ఖాకీ బట్టలు వదిలేసి.. ఖద్దరు బట్టలేసుకోండి: రంగనాథ్‌పై ఏలేటి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: చెరువులను ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) మందుకు సాగుతోంది. రాజకీయ ఒత్తిడులకు ఏ మాత్రం తలొగ్గకుండా హైడ్రా కమిషన్ రంగనాథ్ పక్కాగా తన పని తాను చేసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ శాసనసభా పక్ష నేత Alleti Maheshwar Reddyరంగనాథ్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ప్రజాసేవపై మోజు ఉంటే ఖాకీ బట్టు వదిలేసి.. ఖద్దరు బట్టలు వేసుకోవాలని కామెంట్ చేశారు. అక్రమ నిర్మాణాల పేరుతో హిందువుల ఇళ్లను మాత్రమే కూల్చుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో హైడ్రా పేరుతో లేనిపోని హైప్‌ను సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇంతకీ రంగనాథ్ కమిషనరేనా.. లేక పొలిటికల్ లీడరా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక హైడ్రా పేరుతో నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వసూళ్లు నడుస్తున్నాయనే వార్తలు వస్తున్నాయని ఆరోపించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో సల్కం చెరువులో ఒవైసీ నిర్మాణాలకు ఉన్న కండీషన్లు పల్లా, మర్రి రాజశేఖర్‌రెడ్డికి వర్తించవా అని ప్రశ్నించారు. కాలేజీ కూల్చివేతకు ఒవైసీకి 6 నెలల సమయం ఇచ్చారని.. మరి ఎన్-కన్వెన్షన్‌కు ఎందుకు సమయం ఇవ్వలేదో చెప్పాలన్నారు. పాతబస్తీకి వెళ్లే దమ్ము ప్రభుత్వానికి లేదని.. టార్గెట్ చేసి నిర్మాణాలను కూలుస్తున్నారని ఏలేటి ఆక్షేపించారు.

Advertisement

Next Story