- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధిత మహిళ ఢిల్లీలో ఆత్మహత్యయత్నం
దిశ, వెబ్‌డెస్క్: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తోన్న శేజల్ అనే మహిళ ఢిల్లీలో ఆత్మహత్యయత్నం చేసింది. నాలుగు రోజులుగా ఢిల్లీలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతోన్న శేజల్ ఇవాళ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. తెలంగాణ భవన్‌లోని పార్కింగ్ ఏరియాలో పురుగులు మందు తాగా సూసైడ్ ఆటెంప్ట్ చేసిన శేజల్‌ను అక్కడ ఉన్నవారు గమనించి ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యయత్నానికి పాల్పడిన శేజల్ నుండి ఆ లేఖ లభ్యం అయ్యింది. అందులో ఆమె ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోపణలు చేసింది.
ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆయన అనుచరులు నన్ను కొంత కాలంగా మానసికంగా, వివిధ రకాలుగా హిసిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే నన్ను వేధిస్తూ వాళ్ల అనుచరులతో చంపుతానని బెదిరిస్తుండటంతో నేను ఢిల్లీకి వచ్చి నిరసన తెలుపుతుంటే గత రెండు రోజులుగా ఎమ్మెల్యే అనుచరులు సోషల్ మీడియాలో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి తన గురించి అసభ్యకర రాతలు రాస్తు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అందువల్లే తాను చనిపోవాలనుకుంటున్నానని చనిపోయాక అయినా తనకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు నోట్ లో పేర్కొన్నారు. అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా ఓ మహిళ ఏకంగా ఢిల్లీలో ఆత్మహత్యయత్నం చేయడం గులాబీ పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక, ఆరిజన్ డైయిరీ నిర్వాహకురాలైన శేజల్‌కు, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మధ్య గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించాడుంటూ శేజల్ ఆరోపణలు చేసింది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని శేజల్ గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఎమ్మెల్యే తనును లైంగికంగా వేధించాడని.. అతడి వల్ల ప్రాణహాని ఉందని శేజల్ జాతీయ మహిళ కమిషన్‌లో సైతం ఫిర్యాదు చేసింది. పార్లమెంట్ నూతన భవనం వద్ద, ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద కూడా ఆందోళన చేపట్టిన శేజల్ ఇవాళ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడటం సంచలనంగా మారింది. గతంలో కూడా ఓసారి శేజల్ ఆత్మహత్యయత్నానికి పాల్పడింది.
Also Read..