వెబ్ కౌన్సెలింగ్‌లో తప్పిదాలు.. ఎడిట్ ఆప్షన్ ఓపెన్ అవ్వక తీవ్ర ఇబ్బందులు

by Rajesh |
వెబ్ కౌన్సెలింగ్‌లో తప్పిదాలు.. ఎడిట్ ఆప్షన్ ఓపెన్ అవ్వక తీవ్ర ఇబ్బందులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఉపాధ్యాయుల బదిలీల్లో భాగంగా వెబ్ కౌన్సెలింగ్‌లో ఒకే పేరుతో పలు గ్రామాల పేర్లు ఉండడం వల్ల తప్పులు దొర్లాయని, అలాంటి అప్పీళ్లను పరిష్కరించి తగున్యాయం చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్) రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్ రావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డిని గురువారం కలిసి వినతిపత్రం అంజదేశారు. ఎడిట్ ఆప్షన్ ఓపెన్ అవ్వకపోవడంతో పలువురు టీచర్లు ఇబ్బంది పడ్డారని, వారికి మరోసారి అవకాశం కల్పించాలని వినతిలో పేర్కొన్నారు. అంతేకాకుండా పదోన్నతుల తర్వాత మిగిలిన ఖాళీలను వెంటనే ప్రమోషన్ ఇవ్వాలన్నారు. బదిలీలు అయినప్పటికీ చాలామంది ఉపాధ్యాయులు రిలీవ్ కాలేదని, వారిని వెంటనే రిలీవ్ చేయాలన్నారు. ఒకవేళ ఆ పాఠశాలలకు ఉపాధ్యాయుల అవసరం ఉంటే వర్క్ అడ్జస్ట్‌మెంట్, విద్యా వలంటీర్లు, లేదా తిరిగి అదే పాఠశాలలలో కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొన్నారు. మ్యూచువల్ బదిలీపై వచ్చిన వారిని మిగిలిన ఖాళీల్లో ట్రాన్స్ ఫర్ చేయాలన్నారు. మల్టీ జోన్-1, 2 లలో జీహెచ్ఎం పోస్టులకు మిగిలిన వాటితో పాటు ఉద్యోగ విరమణ పొంది ఖాళీ అయిన వాటిని కలిపి పదోన్నతులు చేపట్టాలని వినతిలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed