ఫిరాయింపులపై మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం కీలక వ్యాఖ్యలు

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-13 08:06:34.0  )
ఫిరాయింపులపై మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ విలీనం అవుతుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. ఫిరాయింపులపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్, బీజేపీకి లేదన్నారు. రెచ్చగొట్టడం వల్లే రాజనీతిని ప్రయోగించాల్సి వచ్చిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ హామీలపై చర్చకు సిద్ధమన్నారు. కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని పొన్నం సవాల్ విసిరారు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ మోడీ అన్నారు. ప్రజలను రెచ్చగొడితే సహించేది లేదన్నారు.

Advertisement

Next Story