- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవరకద్రలో రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్యే..
దిశ, దేవరకద్ర: దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో రూ. 24.63 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని సోమవారం రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డిలు ప్రారంభించారు. దీంతో వాహనదారుల కష్టాలు తీరిపోవడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం మంత్రులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేత ఫైల్ పై తొలి సంతకాన్ని చేయించారు.
ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. పాలమూరును వలస జిల్లగా మార్చిన గుర్తింపు కాంగ్రెస్ దక్కుతుంది అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సెక్రటేరియట్ ప్రారంభోత్సవం రోజు మొదటి సమీక్ష సమావేశం జరిగిందని త్వరలోనే ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తాం అన్నారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అని సీఎంపై పిచ్చి కూతలు మానుకోవాలని లేకపోతే ఊరుకునేది లేదని సూచించారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా మన ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేశారని దీనితో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నామని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కులమతాల మధ్య చిచ్చు పెట్టి మనుషుల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ మంత్రులు సీఎం కేసీఆర్ సహకారంతో దేవరకద్ర రైల్వే ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేసుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రవి నాయక్, ఎస్పీ నరసింహ, ఎంపీపీ రమా శ్రీకాంత్ యాదవ్, జడ్పీటీసీ అన్నపూర్ణ, ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.