Lagacharla : లగచర్ల దాడిలో గాయపడిన అధికారి వెంకట్ రెడ్డికి మంత్రుల పరామర్శ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-13 14:04:11.0  )
Lagacharla : లగచర్ల దాడిలో గాయపడిన అధికారి వెంకట్ రెడ్డికి మంత్రుల పరామర్శ
X

దిశ, వెబ్ డెస్క్ : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుగ్యాల మండలం లగచర్ల(Lagacharla) గ్రామంలో జరిగిన దాడి ఘటనలో గాయపడిన కొడంగల్ అర్బన్ డెవలప్ మెంట్ అథార్టీ స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి(Venkat Reddy)ని రాష్ట్ర మంత్రులు(Ministers) దామోదర్ రాజనర్సింహ, శ్రీధర్ బాబులు పరామర్శించారు.ఎల్బీనగర్ - బైరాముల్ గూడ లోని లక్ష్మీ నరసింహ కాలనీలోని వెంకట్ రెడ్డి నివాసం హర్ష నిలయంలో పరమార్శించారు. దాడి ఘటన కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

ఘటన జరిగిన రోజున వికారాబాద్ కలెక్టర్ పైన, వెంకట్ రెడ్డిపైన లగచర్ల ఫార్మా కంపనీ బాధితులు మూకుమ్మడిగా దాడి చేశారని బాధితుడు వెంకట్ రెడ్డి వివరించారు. పారిపోతున్న తనని తరిమికొట్టడంతో గాయాలపాలయ్యానన్నారు. అక్కడే ఉంటే తన ప్రాణాలకు ప్రమాదమని తలచి తాను పొలాల మీదుగా పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నానని వెంకట్ రెడ్డి వెల్లడించారు.

Advertisement

Next Story