25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ అహంకారం వల్లే 104 ఎమ్మెల్యేల ఉన్న BRS పార్టీ 39కి పడిపోయింది.. ఇందులో 25 మంది కాంగ్రెస్‌లో చేరుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూద్దామన్నా ఇక బీఆర్ఎస్ కనిపించదు అని అన్నారు. కరీంనగర్‌ పర్యటనలో భాగంగా కేసీఆర్ మాట్లాడిన ప్రతీ మాట పచ్చి అబద్ధం అని కొట్టిపారేశారు. పదేళ్లలో తెలంగాణ ఇరిగేషన్ శాఖను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ లాగా పాస్ పోర్ట్‌లు అమ్మి, కాంట్రాక్టర్లకు బ్రోకర్ల లాగా తాను పనిచేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఎవరినో తొక్కడం కాదు.. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌ను బొంద పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఆ ఫ్రస్టేషన్‌లోనే కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్‌పై అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు కేసీఆర్ ఇంట్లో పడుకొని.. ఇప్పుడు ‘సిగ్గు, శరం, లజ్జ’ అన్నీ వదిలేసి మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. కేసీఆర్ లాగా వేరే రాష్ట్రాల్లో మాట్లాడితే ఉరి తీస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేటకు వదిలింది సాగునీళ్ళు కాదని.. తాగునీరు మాత్రమే అని చెప్పారు. కేసీఆర్ లాంటి పొగరుబోతు వ్యక్తిని నేను ఇంకొకరిని చూడలేదని అన్నారు. కేసీఆర్ కమిషన్ల కక్కుర్తి వల్లే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కాస్త కాళేశ్వరం ప్రాజెక్టుగా మారిందన్నారు. ఈ కరువు కేసీఆర్ తెచ్చింది మాత్రమే.. కాంగ్రెస్ తెచ్చింది కాదని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed