- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: కొత్త రేషన్ కార్డులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే అర్హులైన అందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం నాగార్జున సాగర్ సెగ్మెంట్‌లో మంత్రి ఉత్తమ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్‌కు పోటీ లేదని అన్నారు. 14 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదని అన్నారు. నల్లగొండ, భువనగిరిలో ఆ రెండు పార్టీలు గల్లంతు కావడం ఖాయమని ఎద్దేవా చేశారు.
మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని అయితే దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని అన్నారు. పదేళ్లుగా కేంద్రం తెలంగాణకు అన్ని విషయాల్లో అన్యాయం చేసిందని చెప్పారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశ దశ, దిశ మార్చబోతున్నాయని అన్నారు. భారీ మెజార్టీతో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చూడబోతున్నామని జోస్యం చెప్పారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మాయం కావడం ఖాయమన్నారు.