Minister Uttam Kumar Reddy : నల్గొండ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తాం..

by Sumithra |
Minister Uttam Kumar Reddy : నల్గొండ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తాం..
X

దిశ, మిర్యాలగూడ టౌన్ : నల్గొండ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయనున్నట్లు నీటి పారుదల శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవులపల్లి మండలం చిట్యాల గ్రామంలో నిర్మించనున్న దున్నపోతుల గండి ఎత్తిపోతల పథకం ప్రదేశాన్ని ఆదివారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం మిర్యాలగూడ నియోజకవర్గంలో కృష్ణా నది, ఎడమ కాలువ పై నూతనంగా నిర్మించనున్న లిప్టుల పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొత్తల పాలెం - వాడపల్లి లిఫ్ట్ ఇరిగేషన్, వీర్లపాలెం లిఫ్ట్ ఇరిగేషన్, తోపుచర్ల లిఫ్ట్ ఇరిగేషన్, కేశవపురం - కొండ్రపోల్ లిఫ్ట్ ఇరిగేషన్లకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ పనులను వచ్చే ఏడాది ఆగస్టు వరకు పనులు పూర్తి చేసి 45 వేల ఎకరాలకు సాగు నీరు అందించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ లిప్టుల నిర్మాణానికి రూ.490 కొట్లు విడుదల చేస్తామన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఎంపీగా ఉన్నపుడు అభివృద్ధి చేయలేకపోయానని, ప్రస్తుతం మంత్రిగా నియోజకవర్గం అభివృద్ధి చేయాడానికి ముందుంటానని అన్నారు. సాగర్ ప్రాజెక్టు నిండుగా ఉన్నందున్న రెండు పంటలకు రైతులకు సాగు నీరందించనున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమమే ద్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హమీలను ప్రభుత్వం అమలు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, స్కైలాబ్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, తమ్మడబోయిన అర్జున్, దేశిడి శేఖర్ రెడ్డి, నూకల వేణుగొపాల్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story