కేవలం వారికే రుణమాఫీ కాలేదు.. మంత్రి తుమ్మల క్లారిటీ

by Gantepaka Srikanth |
కేవలం వారికే రుణమాఫీ కాలేదు.. మంత్రి తుమ్మల క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: రుణమాఫీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆరా తీశారు. శుక్రవారం సంబంధిత అధికారులతో సచివాలయం వేదికగా సమావేశమై.. క్షేత్ర స్థాయిలో తలెత్తిన సమస్యలపై చర్చించారు. తక్షణమే సమస్యలు అన్నీ పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడారు. రూ.2 లక్షల లోపు కుటుంబ నిర్ధారణ జరిగిన కుటుంబాలకు రుణమాఫీ జరిగినట్లు తెలిపారు. కుటుంబ నిర్ధారణ లేని 4,24,873 ఖాతాల వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలోనే కుటుంబాల సమాచార సేకరణకు కొత్త యాప్ తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి వ్యవసాయ అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లోని రైతు వేదికలు, వ్యవసాయ కార్యాలయాల్లోనూ ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. లక్షా 24 వేల 545 ఖాతాల్లో ఆధార్ వివరాలు సరిగా లేవని అన్నారు. ఇలా ఆధార్‌ తప్పుగా ఉన్న వాటిలో ఇప్పటివరకు 41,322 ఖాతాలు సరిచేశామని చెప్పారు. రూ.2 లక్షలకు పైగా ఉన్న రైతులకు త్వరలోనే దశల వారీగా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed