- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విత్తనాలను రెడీ చేయండి.. నకిలీ సీడ్స్ పై జాగ్రత్త: మంత్రి తుమ్మల
దిశ, తెలంగాణ బ్యూరో: రైతులకు విత్తనాలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీజన్‌కు కావాల్సిన విత్తనాలను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు.వరి విత్తనాల ఉత్పత్తి తో పాటు మిగతా పంటల ఉత్పత్తిని పెంచాలని, కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వంపై ఆధారపడకుండా, టెక్నాలజీని ఎలా వాడుకోవచ్చో తెలుసుకోవాలని చెప్పారు. సచివాలయంలో వ్యవసాయ, కో ఆపరేటివ్, మార్కెటింగ్, జౌళి శాఖల అధికారులతో పాటు సంబంధిత కార్పోరేషన్ల చైర్మన్ తో కలిసి శనివారం మంత్రి తుమ్మల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ...ఆయిల్ పామ్ విస్తీర్ణాన్ని పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయిల్ ఫెడ్ అధికారులను ఆదేశించారు. 2024-25 సంవత్సరానికి 1 లక్ష ఎకరాలకు ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని, పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని సూచించారు. పెరిగిన పంట మార్పిడి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగు మరియు వివిధ ఉద్యాన పంటలపై రాయితీలు ఇవ్వాలని, పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని మంత్రి పేర్కొన్నారు. రైతాంగానికి మేలు జరగాలని భావించే అన్ని కార్పోరేషన్లు వ్యవహరించాలని, కార్పోరేషన్లన్ని బలోపేతం చేయాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 5,700 విత్తన ఉత్పత్తి దారులు ఉన్నారని, వీరంతా సీడ్ సర్టిఫికేషన్ నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా విత్తనాల ఉత్పత్తి చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. సీడ్ కార్పొరేషన్ చైర్మన్, ఆగ్రోస్ , డీసీఎంఎస్, పీఏసీఎస్ల ద్వారా సరఫరా జరుగుతుందని మంత్రికి వివరించారు .
ప్రైవేట్ గోదాములు నిండుగా ఉన్నప్పుడు మన గోదాములు ఖాళీగా ఉంటే లోపం ఏంటో గమనించాలి. మన గోదాములు 100 శాతం కెపాసిటీతో నిండాలి. వివిధ సంస్థల ఆధీనంలో ఉన్న ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని, వాటిని వినియోగంలోకి తీసుకురావడానికి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. బోర్డులలో సభ్యుల నియామకం కూడా ముఖ్యమంత్రి వచ్చాక చేపట్టాలని చెప్పారు. ఆగ్రోస్ కు పునర్వైభవం తీసుకురావాలని, ఏ నిర్ణయమైనా ప్రభుత్వం ఆమోదిస్తుందని మంత్రి వెల్లడించారు.
ఖమ్మం మార్కెట్‌లో ఆధునీకరించడంతో ఈ సామర్థ్యాన్ని 1.37 లక్షల బ్యాగుల వరకు పెంచుకోవచ్చని, ఓపెన్ ఏరియాలలో నిల్వ ఉంచే అవకాశాన్ని కలిగి మరొక 1.20 లక్షల బ్యాగుల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు చెప్పారు. ఈ మార్కెట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేసి, నూతన సాంకేతికతతో దేశంలోనే అగ్రగామి మార్కెట్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రైతులకు మెరుగైన సౌకర్యాలను అందించడంతో పాటు పర్యావరణహితంగా మార్చి, సౌర పానెల్స్ , నీటి సేకరణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉత్తమ వాణిజ్య సదుపాయాలతో అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలను రూపొందించాలని, రైతులకు లాభం చేకూరే విధంగా పరిష్కారాలను తయారు చేయాలని, సూచించారు . దేశంలోనే ఆదర్శమయిన మార్కెట్‌గా తీర్చిదిద్దాలని, ఆధునీకరణ పనులు వేగంగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ జంగ రాఘవరెడ్డి, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి, తెలంగాణ స్టేట్ వేర్హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, తెలంగాణ మార్క్ ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి , వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్ రావు, టెస్కో మేనేజింగ్ డైరెక్టర్ శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ సంచాలకులు గోపి , వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ ఉదయ్ , హార్టికల్చర్ సంచాలకులు యాస్మిన్, తెలంగాణ స్టేట్ వేర్హౌస్ కార్పొరేషన్ ఎండీ కొర్ర లక్ష్మీ ఇతర అధికారులు పాల్గొన్నారు.