Minister Tummala Nageshwar Rao: వరి కాదు ఆ పంటలపై దృష్టి పెట్టండి.. రైతులకు కీలక సూచన

by Satheesh |
Minister Tummala Nageshwar Rao: వరి కాదు ఆ పంటలపై దృష్టి పెట్టండి.. రైతులకు కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ కీలక సూచన చేశారు. రైతులు వరి పంట ఒక్కటే కాకుండా ఆదాయం వచ్చే పంటలపై దృష్టి పెట్టాలని సూచించారు. సీజనల్ పంటలను సాగు చేయడం ద్వారా వరి కంటే ఎక్కువ లాభం ఆర్జించవచ్చని చెప్పారు. ముఖ్యంగా రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై ఫోకస్ పెట్టాలని సూచించారు. ఆయిల్ ఫామ్ పంటకు ప్రభుత్వం పోత్సాహకం అందించడంతో పాటు ఎక్కువ ప్రాఫిట్ గడించవచ్చని రైతులకు సలహా ఇచ్చారు.

ఇక, అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా కౌలు రైతులను ఆదుకుంటామన్నారు. రైతు భరోసా స్కీమ్‌తో పాటు పంటలకు బోనస్ ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన క్లారిటీ ఇచ్చారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ప్రాసెస్‌ను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదటి విడతలో భాగంగా ఈ నెల 18వ తేదీన లక్ష లోపు పంట రుణాలు ఉన్న రైతులకు లోన్లు మాఫీ చేశారు. విడతల వారీగా ఆగస్ట్ 15 లోపు రూ.2 లక్షలు మాఫీ చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది.

Advertisement

Next Story

Most Viewed