Minister Thummala: రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం: మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-07-30 07:35:29.0  )
Minister Thummala: రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం: మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ అసెంబ్లీ ప్రాంగణంలో రెండో విడత రైతు రుణమాఫీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల అభ్యున్నతి కోసం కాంగ్రస్ ప్రభుత్వం పాటుపడుతోందని అన్నారు. రెండో విడత రుణమాఫీలో భాగంగా రూ.1.5 లక్షల వరకు రుణం ఉన్న రైతులకు లబ్ధి చేకూరుతోందని అన్నారు. రెండో విడతలో 6.4 లక్షల మంది రైతులకు రూ.6,190 కోట్లు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. తొలి విడతలో 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్లు విడుదల చేశామని తెలిపారు.

రైతు రుణ మాఫీతో రాష్ట్ర వ్యప్తంగా ఇప్పటి వరకు 17.75 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని అన్నారు.తులకు రూ.6,190 కోట్లు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. తొలి విడతలో 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్లు విడుదల చేశామని తెలిపారు. రైతు రుణ మాఫీతో రాష్ట్ర వ్యప్తంగా ఇప్పటి వరకు 17.75 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందని అన్నారు. ఓకే పంట కాలంలో రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఆగస్టులో రూ.2 లక్షల లోపు ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామని అన్నారు. పంట భీమా ద్వారా అన్నదాతలకు అండగా ఉంటామని తెలిపారు. త్వరలోనే రైతు భరోసాపై గత ప్రభుత్వ విధివిధానాల కంటే భిన్నమైన విధివిధానాలు రూపొందించి అమలు చేస్తామని అన్నారు.

Advertisement

Next Story