Minister Thummala: పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల సమీక్ష.. రైతులకు కీలక సూచన

by Shiva |
Minister Thummala: పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల సమీక్ష.. రైతులకు కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పత్తిని అమ్ముకోవాలని వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Minister Thummala Nageshwar Rao) అన్నారు. ఇవాళ ఆయన మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఉదయ్ కుమార్ (Uday Kumar), ఇతర అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సేకరణకు సీసీఐ అధికారులు (CCI Officials) 105 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారని తెలిపారు.

నోటిఫై చేసిన ప్రతి జిన్నింగ్ మిల్లు (Ginning Mill) పని చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. తేమ శాతం సడలింపుపై సీసీఐ (CCI) సీఎండీ (CMD)తో కూడా మాట్లాడామని అన్నారు. పత్తి కొనుగోళ్లలో ఏమైనా ఇబ్బందులు ఉంటే రైతులు వాట్సాప్ (Whatssap) నెంబర్ 8897281111 కు సంప్రదించాలని స్పష్టం చేశారు. సమస్యలపై కలెక్టర్లు, మర్కెటింగ్ అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల సూచించారు.

Advertisement

Next Story