- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మలేషియా టూర్ లో మంత్రి తుమ్మల
దిశ, వెబ్ డెస్క్ : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మలేషియా చేరుకున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఆయిల్ పామ్ సాగు స్టడీ టూర్ నిర్వహించనున్నారు. నేడు కౌలాలంపూర్ లో ప్లాంటేషన్ కమోడిటీస్ ఇండస్ట్రీ మలేషియా మంత్రి జోహారీ ఘనితో, మ్యాట్రేడ్ చైర్మన్ రీజల్ మెరికన్ తో మంత్రి తుమ్మల సమావేశమవుతారు. కౌలాలంపూర్ కన్వెన్షన్ సెంటర్ లో ఆయిల్స్ అండ్ ఫాట్స్ ఇంటర్ నేషనల్ కాంగ్రెస్ ఎగ్జిబిషన్ సందర్శించనున్నారు. హార్వెస్టింగ్ టూల్స్ డెమోను మంత్రి తుమ్మల పరిశీలించనున్నారు. మన ఇండియా ప్రతీ సంవత్సరం మలేషియా, ఇండొనేసియా నుంచి 70 శాతం దాకా పామాయిల్‌ని దిగుమతి చేసుకుంటోంది. ఆ పంట ఇండియాలోనే సాగు చేస్తే, ఇక దిగుమతితో పని ఉండదు. ఆ మేరకు భారీగా విదేశీ మారక ద్రవ్యం భారీగా ఆదా కానుంది. అయితే సాంప్రదాయ పంటల సాగుకు అలవాటు పడిన ఇండియాలో అయిల్ ఫామ్ ఈ పంట సాగు చెయ్యాలంటే ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. అప్పుడే రైతులు ముందుకొస్తారు. ఈ దిశగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నిస్తుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఆయిల్ పామ్ పంటలు వెయ్యమని పదే పదే చెబుతున్నారు. ఎకరాకి రూ.లక్షన్నర నుంచి రూ.1 లక్షల దాకా ఆదాయం వస్తుంది అంటున్నారు. కొందరు రైతులేమో తమకు ఈ పంట కలిసి రావట్లేదు, ఖర్చులు కూడా రావట్లేదు అంటున్నారు. ఈ నేపథ్యంలో మలేషియా స్టడీ టూర్ తో రాష్ట్రంలో అయిల్ ఫామ్ విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహాన పెంపొందించుకోనున్నారు.
ఇండియాలో ఒక కోటి ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసినప్పుడే.. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం రాదని, అందులో మన రాష్ట్రం వాటా మెరుగ్గా ఉండాలని తెలంగాణ ఉద్యాన వన శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇండియాలో 7 లక్షల ఎకరాల్లోనే ఈ పంట సాగవుతోంది. అంటే.. ఈ పంట సాగుకి చాలా అవకాశాలు ఉన్నాయంటున్నారు. రైతులు ఇప్పుడు అయిల్ ఫామ్ సాగు చేపట్టడం లాభదాయకమంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం రాష్ట్రంలో 2.30 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలున్నాయి. ప్రస్తుతం ఆయిల్ పామ్ గింజల నుంచి పామాయిల్‌ని తీసే ఫ్యాక్టరీలు ఖమ్మం జిల్లాలో ఉన్నాయి. ప్రభుత్వం మరో 14 ఫ్యాక్టరీలను ఏర్పాటు చెయ్యబోతోంది. ఆయిల్ పామ్ తోటల సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 1 టన్ను పామాయిల్‌కి మద్దతు ధరను రూ.10వేలుగా నిర్ణయించింది. ఐతే.. ప్రస్తుతం మార్కెట్ రేటు టన్నుకు రూ.20 వేలుగా ఉందని అధికారులు అంటున్నారు. 1 ఎకరాకి కనీసం 50 మొక్కలు నాటుకోవచ్చని, 35 ఏళ్ల పాటూ మొక్కలు ఉంటాయనీ, 30 ఏళ్లపాటూ దిగుబడి వస్తుందని చెబుతున్నారు.