వచ్చే ఎన్నికల్లో 100 స్థానాలకు పైగా గెలుస్తాం: మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-03-12 08:28:02.0  )
వచ్చే ఎన్నికల్లో 100 స్థానాలకు పైగా గెలుస్తాం: మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాడులు చేస్తూ వేధిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే కవిత ఈడీ విచారణను ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మహిళలను అవమానించేలా మాట్లాడడని మండిపడ్డారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలను బీజేపీ ఏజెంట్లుగా మార్చుకుందని ఫైరయ్యారు. బీజేపీ దేశంలో దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. ఎవరెన్ని చేసినా తెలంగాణలో బీఆర్ఎస్‌కు తప్ప ఇతర ఏ పార్టీకి అవకాశం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లకు పైగా గెలుస్తామని మంత్రి తలసాని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed