- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
"వీళ్లు మగాళ్లేనా... అంటే మా వాళ్ళు ఎలా ఊరుకుంటారు"
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం... త్యాగాలు చేసిందా..? ప్రజల కోసం ఏమైనా సేవలు అందించిందా..!? ఏ హక్కుతో తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పర్యటనలు చేస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎవరి ఇష్టం వారిది అనుకున్నాం.. కానీ ఆమె నియోజకవర్గాలలో పర్యటిస్తూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను, మంత్రులమైన మమ్ములను, వాడు... వీడు అని సంభోదిస్తావా..!? చెప్పుతో కొడతాను అంటావా..!? మా ఎమ్మెల్యేలు ఉన్న గడ్డమీద వీళ్లు మగాళ్లేనా..? అంటావా..!? మీ మాటలు మీ రాష్ట్రంలో ఉన్న మా ఆడపడుచులు అంటే ఊరుకుంటారా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.
ఇక్కడ రైతులకు 24 గంటల విద్యుత్ అందడం లేదు అని ఆందోళన చేస్తున్నావా.. పంటలు పండటం లేదన.. పింఛన్లు తగ్గించామని ..? ఏ ఉద్దేశంతో చేస్తున్నావు నీ యాత్రలు. ఆంధ్రా వెళ్ళు.. ఇక్కడ ఉన్న పథకాలను అమలు చేయమని.. కర్ణాటకలో చేయి... ఒక అర్థం ఉంటది.. అని షర్మిలకు సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఊరికేనే రాలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో త్యాగాలు చేసుకుని సాధించుకున్నాం... అలాంటి ఈ రాష్ట్రంలో కుట్రలు చేస్తూ.. అలజడులు సృష్టిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి మీరు ప్రయత్నిస్తున్నారు తప్ప ఈ రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదని మంత్రి స్పష్టం చేశారు. మీ తండ్రి వైయస్ మీ రాష్ట్రానికి బాగు చేశారు.. మా తెలంగాణకు అన్యాయం చేశారు. అక్కడ దేవుడు అంటారు. ఇక్కడ మాత్రం ఏమనాలో అదే అంటామని మంత్రి స్పష్టం చేశారు. మహిళగా మాట్లాడకూడని మాటలు మాట్లాడటం వల్ల ఈ ప్రాంత ప్రజలు నీకు బుద్ధి చెప్పారని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రం జోలికి వచ్చి ఇష్టారీతిగా మాట్లాడితే ఏ మాత్రం సహించేది లేదని మంత్రి హెచ్చరించారు.