Minister Sridhar Babu: పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చాం.. తప్పకుండా అండగా ఉంటాం

by Gantepaka Srikanth |
Minister Sridhar Babu: పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చాం.. తప్పకుండా అండగా ఉంటాం
X

దిశ, వెబ్‌డెస్క్: మలేషియా తెలంగాణ అసోసియేషన్(Malaysian Telangana Association) దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పాల్గొన్నారు. పదేళ్లు పూర్తి చేసుకున్న మలేషియన్ తెలంగాణ అసోసియేషన్‌(Malaysian Telangana Association)కు రాష్ట్ర ప్రభుత్వం తరుపున శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చామని.. రాష్ట్రానికి వెళ్తే మా సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకుంటామని తెలిపారు. ప్రపంచ దేశాల్లో తెలంగాణ(Telangana) వాసులు ఎక్కడ ఉన్నా వాళ్ల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని అనుకుంటామని హామీ ఇచ్చారు. తమ వంతు సహకారం తప్పకుండా ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ ప్రజలు భవిష్యత్‌లో అన్ని దేశాల్లో.. అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story