- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
జీవన్ రెడ్డి పార్టీకి పెద్ద దిక్కు.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
by Rajesh |
X
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేరిక చిచ్చు రాజేసింది. ఆయన చేరికతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారు. అయితే, విషయం తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు సోమవారం ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి న్యాయం జరిగేలా చూస్తాం అన్నారు. జీవన్ రెడ్డి గురించి అధిష్టానంతో మాట్లాడతా అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేకపోయినా.. జీవన్ రెడ్డి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారని గుర్తు చేశారు. పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేశారన్నారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కోసం ఇంతకాలం కష్టపడి పనిచేశా అన్నారు. కార్యకర్తల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటా అన్నారు.
Advertisement
Next Story