JAC : ఇలాంటి జేఏసీ రాష్ట్రంలో ఇదే మొదటిది.. మీరూ ఔరా అనక తప్పదు..!

by Bhoopathi Nagaiah |   ( Updated:2024-10-26 13:09:56.0  )
JAC : ఇలాంటి జేఏసీ రాష్ట్రంలో ఇదే మొదటిది.. మీరూ ఔరా అనక తప్పదు..!
X

దిశ, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా(Suryapet District)లోని ఆత్మకూర్(ఎస్) మండలం (Atmakur(S) Mandal) అభివృద్ధి, ఆ ప్రాంత ప్రజలకు సరైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యంగా జాయంట్ యాక్షన్ కమిటీ (JAC) ఏర్పడింది. మండలంలోని సామాజిక ఉద్యమకారులందరూ కలిసి ఒక సామాజిక ఉమ్మడి ఉద్యమ వేదికగా ఏర్పడ్డారు. శనివారం మండలంలోని నెమ్మికల్లు పూర్ణిమ ఫంక్షన్ హాల్లో సమావేశమైన సామాజికవేత్తలు జేఏసీని ప్రకటించారు. ఈ సందర్బంగా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్టు, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు(State Best Journalist Award) గ్రహిత భూపతి రాములు (Bhoopathi Ramulu) మాట్లాడారు.

నూతనంగా ఏర్పడ్డ జేఏసీ ఈ ప్రాంత సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. ప్రజల తరఫున గళం వినిపించే దిశగా జేఏసీ పని చేస్తుందని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకు సరైన విద్య, వైద్యం, రక్షణ పొందే విధంగా పాటుపడుతుందన్నారు. దీనికి న్యాయ, వైద్యరంగ నిపుణుల సహకారం తీసుకుంటుందని వెల్లడించారు. రాజకీయాల్లో మార్పు, కొత్తదనం కోసం యువతను ప్రోత్సహిస్తుందని భూపతి రాములు స్పష్టం చేశారు. మండల వ్యాప్తంగా ప్రతిభావంతులను గుర్తించి జేఏసీ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రతి సామాన్య పౌరుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా పోరాటం చేస్తుందని వివరించారు. బెల్టు షాపులు, బహిరంగ మద్యపాన నిషేధం అమలుకు పాటుపడుతుందన్నారు. జేఏసీ చేపట్టిన ప్రజా సంక్షేమ, సామాజిక కార్యక్రమాలకు అన్ని రాజకీయపార్టీలు, ఉద్యమ సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జేఏసీ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఏకగ్రీవంగా ఎన్నికైన జేఏసీ కమిటీ ఇదే..

జేఏసీ మండల అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు భూపతి రాములు, గౌరవ సలహాదారు మరియు లీగల్ అడ్వైజర్‌గా న్యాయవాది దండ వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు, కార్యనిర్వాహకులుగా గంపల కృపాకర్, ప్రధాన కార్యదర్శిగా దొంతగాని కరుణాకర్, కోశాధికారిగా మేడి కృష్ణ, సంస్కృతిక కార్యదర్శిగా గుండు వెంకన్న, అధికారిక స్పోక్ పర్సన్స్ భారీ అశోక్, పందిరి మాధవరెడ్డి, తగుళ్ల జనార్ధన్ యాదవ్, నాగరాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫయాజ్, కిరణ్, సుందర్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ఇదే మొదటి జేఏసీ..

మండలాభివృద్ధి, రాజకీయాల్లో మార్పు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలన్న లక్ష్యంతో జేఏసీ ఏర్పడటం రాష్ట్రంలో ఇదే మొదటిసారి. ఎలాంటి రాజకీయ కాంక్ష, స్వలాభం, స్వార్థం లేకుండా మండలంలోని సామాజికవేత్తలు, ఉద్యమకారులు కలిసి జేఏసీగా ఏర్పడటంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జేఏసీ ఆధ్వర్యంలో మండలంలో బెల్ట్ షాపులను మూసివేయించడంతోపాటు విద్యా, వైద్యం అందించేందుకు కృషి చేయనున్నారు. అలాగే ప్రజలకు సరైన న్యాయసలహాలు అందించేందుకు కృషి చేయనుంది. ఇప్పటికే జేఏసీ అధ్యక్షుడు సారధ్యంలో గ్రామస్తులంతా కలిసి మండలంలోని గట్టికల్లు (Gattikal) గ్రామంలో బెల్ట్ షాపులను మూసివేయించారు. ఇస్తాలపురం, పాతర్లపహాడ్ గ్రామాల్లోనూ మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు. ఈ గ్రామాల స్ఫూర్తిగానే మండలంలోని అన్ని గ్రామాల్లో సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు జేఏసీ కృషి చేయనుంది. ఇందుకు ఆయా గ్రామాల సామాజికవేత్తలు, ఉద్యమకారులు, విద్యావేత్తలు, యువజన, మహిళా సంఘాలతో కలిసి పని చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed