AP:‘అమరావతిలో ఎవరు ఎంత భూమి కొన్నారో బయటపెట్టాలి’.. మాజీ కేంద్రమంత్రి డిమాండ్

by Jakkula Mamatha |
AP:‘అమరావతిలో ఎవరు ఎంత భూమి కొన్నారో బయటపెట్టాలి’.. మాజీ కేంద్రమంత్రి డిమాండ్
X

దిశ ప్రతినిధి, తిరుపతి: రాజధాని అమరావతిలో ఎంతమంది వీఐపీలు, ప్రజాప్రతినిధులు ఎన్నెన్ని ఎకరాల భూములు కొన్నారో ఆ వివరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు బయట పెట్టాలని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. శనివారం తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ.. అమరావతి నిర్మాణానికి 50 వేల ఎకరాలు కావాలా ఓ చంద్రబాబు ఎందుకయ్యా అన్ని వేల ఎకరాలు అవసరమా? అంటూ ప్రశ్నించారు. 12 వేల కోట్ల రూపాయలు హడ్కో దగ్గర అప్పు తెచ్చారు.

ఎంత వడ్డీకి తెచ్చారు? ప్రజలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. దేశ రాజధాని ఢిల్లీ కట్టడానికి 17 వేల ఎకరాల్లో పూర్తి చేశారు. దాదాపు 100 సంవత్సరాలు పట్టింది. ఢిల్లీ రాజధాని నగరం నిర్మాణానికి అని తెలియజేసారు. అమెరికాలో న్యూయార్క్ అనే సిటీ 14000 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణమైంది.. మరి అమరావతికి 50 వేల ఎకరాలు ఎందుకు అని నిలదీశారు.తిరుపతి పుణ్యక్షేత్రం లో ఏడు వేల ఎనిమిది మంది నిరుపేద మహిళలకు నాలుగు లక్షల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని చంద్రబాబు 292 కోట్లు రూపాయలు దారి మళ్లించరని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed