Missing : విషాదం...ప్రాణహిత నదిలో ముగ్గురు గల్లంతు

by Sridhar Babu |
Missing : విషాదం...ప్రాణహిత నదిలో ముగ్గురు గల్లంతు
X

దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ (Komuram Bheem Asifabad)జిల్లాలో ప్రాణహిత నదిలో ముగ్గురు (Three Missing)గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే...బెజ్జూరు మండలం గోల్కొండ గ్రామానికి చెందిన జహీర్ హుస్సేన్ (24), ఇర్షాద్ (20), మోసిద్ (22), కాజీమ్ అనే యువకులు శనివారం బెజ్జూర్ మండల కేంద్రంలో బంద్ ఉండటంతో సరదాగా బెజ్జూర్ మండలం ఎర్రబండ రేవు వద్ద ప్రాణహిత నది(Pranahita river)లో ఈత కొట్టేందుకు వెళ్లారు.

కానీ జహీర్ హుస్సేన్, ఇర్షాద్, మోసిద్​లు ప్రాణహిత నదిలో గల్లంతయ్యారు. వీరు గల్లంతైనట్లు ప్రత్యక్ష సాక్షి కాజీమ్ కుటుంబీకులకు, పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దాంతో హుటాహుటిన కుటుంబీకులు, బెజ్జూర్ ఎస్సై విక్రమ్ సంఘటనా స్థలాన్ని సందర్శించి కారణాలను తెలుసుకున్నారు. గల్లంతైన ముగ్గురు యువకుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed