- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
RR ట్యాక్స్ కాదు.. మోడీ, అంబానీ ట్యాక్స్.. ప్రధాని వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఆర్ఆర్ (రేవంత్, రాహుల్) ట్యాక్స్ నడుస్తోందన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ కాదు దేశంలో మోడీ, అంబానీ ట్యాక్స్ నడుస్తోందని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోందన్న మోడీ వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. అవినీతిలో దేశంలో ఉన్న అన్ని పతకాలు ఎన్డీఏకే ఇవ్వాలని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు కాలేదు అప్పుడే మాపైన ఆరోపణలా అని అసహనం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలన్నీ తప్పకుండా అమలు చేస్తామని, రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందిస్తామని అన్నారు. కాగా, ఇటీవల తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై విరుచుకుపడిన విషయం తెలిసిందే. తెలంగాణ ఢిల్లీకి ఏటీఏంగా మారిందని, రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అవినీతికి మారుపేరు కాంగ్రెస్ అని విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు పై విధంగా కౌంటర్ ఇచ్చారు.