- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
MLC జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబు.. కాంగ్రెస్‌లో తీవ్ర ఉత్కంఠ
దిశ, వెబ్‌డెస్క్: జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఆదివారం రాత్రి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక, చేరిక విషయమై తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఎమ్మె్ల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయంచినట్లు తెలిసింది. దీంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి శ్రీధర్ బాబు వెళ్లారు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్‌లు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. జీవన్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగిస్తున్నట్లు తెలిసింది. అయితే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీసుకునే నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. 2014 నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు సంజయ్ జీవన్ రెడ్డిలు జగిత్యాల పాలిటిక్స్‌లో ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇదే విషయమై కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో సమావేశమైన జీవన్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తనకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటా అని చెప్పినట్లు తెలుస్తోంది.