చింతల్‌తండా ఘ‌ట‌న‌పై మంత్రి సీతక్క రియాక్షన్

by Rajesh |
చింతల్‌తండా ఘ‌ట‌న‌పై మంత్రి సీతక్క రియాక్షన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చింతల్‌తండాలో జ‌రిగిన జంట హ‌త్యలపై మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీత‌క్క తీవ్ర విచారం వ్యక్తం చేసారు. ప్రేమ పేరుతో ఉన్మాదిలా మారి, యువ‌తి త‌ల్లిదండ్రుల‌ను అతి కిరాత‌కంగా చంపడం దారుణ‌మ‌న్నారు. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేసిన‌ట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఘటనపై మంత్రి సీతక్క గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జంట హత్య కేసులో నిందితుడికి క‌ఠిన శిక్ష ప‌డేలా ప్రభుత్వం చ‌ర్యలు తీసుకుంటుంద‌ని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. దాడిలో గాయప‌డిన యువతికి, ఆమె సోద‌రుడికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని, బాధిత కుటుంబానికి ర‌క్షణ క‌ల్పిస్తామ‌న్నారు. ఇలాంటి దుర్మార్గాలపై త‌మ ప్రభుత్వం క‌ఠినంగా వ్యవ‌హరిస్తోంద‌ని తెలిపారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ‌, మ‌హిళా శిశు సంక్షేమ శాఖల మ‌ధ్య స‌మన్వయం పెంచే చ‌ర్యలు చేప‌డ‌తామ‌ని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed