- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అబద్ధాలను అద్భుతంగా ఆవిష్కరించడంలో BRS దిట్ట.. అసెంబ్లీ వేదికగా సీతక్క ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీపై మంత్రి సీతక్క మరోసారి విరుచుకుపడ్డారు. మంగళవారం అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అబద్ధాలను అద్భుతంగా ఆవిష్కరించడంలో బీఆర్ఎస్ పార్టీ దిట్ట అని విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆసరా పెన్షన్ ఇవ్వడం లేదన్న బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్‌గా.. బీఆర్ఎస్ హయాంలో ఒక నెల ఆసరా పెన్షన్ మొత్తమే ఇవ్వలేదన్నారు. 2020 జూలై నెలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ మొత్తమే ఇవ్వలేదని ఈ సందర్భంగా సీతక్క గుర్తు చేశారు.
గత పదేళ్లలో ఎస్టీలకు ఉద్యోగాలే రాలేదని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి కేసీఆర్ కిట్ స్కీమ్ అవకతవకలపై విచారణ చేయిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, వచ్చే నెల (ఆగస్ట్) 5 నుండి 13 వరకు గ్రామాల్లో స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సీతక్క పిలుపునిచ్చారు. పల్లెల ప్రగతి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు.