- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Seethakka: పంచాయతీ రాజ్ రూరల్ అధికారులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రామీణాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీఠ వేస్తుందని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. తాజాగా గ్రామీణాభివృద్ధికి నిధులు మంజూరు చేసిన (Bhatti Vikramarka) ఆర్దిక మంత్రి భట్టి విక్రమార్కకు ప్రజా భవన్‌లో కలిసి పూల మొక్క అందచేసి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్దికి మా ప్రభుత్వం అధిక ప్రధాన్యతనిస్తోందని సీతక్క అన్నారు. ఎన్నడు లేని విధంగా నిధులు మంజూరు చేసిన పనులు చేయిస్తున్నామని వెల్లడించారు. మొదటి విడతలో రూ. 2682 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తాజాగా మరో రూ. 2773 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఇవే కాకుండా ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రూ.197 కోట్లు సాంక్షన్ చేసినట్లు స్పష్టం చేశారు.
గతంలో పీఎంజీఎస్‌వై కోసం రూ. 110 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. పల్లెల్లో రోడ్లు, డ్రేనేజీలు, ఇతర మౌళిక వసతుల కల్పన కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రాబోయే కాలంలో మరిన్ని నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా క్షేత్ర స్ధాయి పంచాయతీ రాజ్ రూరల్ ఇంజనీరింగ్ అధికారులకు వాహన సదుపాయం తెలంగాణ ప్రభుత్వం కల్పించిందన్నారు. పనుల పర్యవేక్షణ కోసం ఈఈలు, డిప్యూటీ ఈఈలు, ఎస్ఈ లకు వెహికిల్స్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 237 మంది ఇంజనీరింగ్ అధికారులకు రూ. 5 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఒక్కో వాహన అద్దె చెల్లింపున కోసం నెలకు రూ.33 వేలు విడుదల చేసినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వంలో అధికారులకు వెహికిల్స్ అలవెన్స్ లేదని, మారు మూల ప్రాంతాల్లో జరిగే పనుల పర్యవేక్షణకు వెల్లేందుకు ఇంజనీర్లు ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. వాల్ల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం, వాహన సదుపాయం కల్పించిందన్నారు.
ఈ సందర్భంగా వాహన సదుపాయం కల్పించిన ప్రభుత్వానికి రుణ పడి ఉంటామని పంచాయతీ రాజ్ విభాగ ఈఎన్సీ కనకరత్నం ప్రకటించారు. గతంలో వాహన అలవెన్స్ లేకపోవడంతో ఇంజనీర్లు అవస్థలు పడ్డారని కనకరత్నం తెలిపారు. వాహన కష్టాలు తీర్చిన ప్రభుత్వానికి, మంత్రి సీతక్కకు కనకరత్నం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.