చిన్నారులకు లిఫ్ట్ ఇచ్చిన మంత్రి సబితా (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-09-21 10:48:39.0  )
చిన్నారులకు లిఫ్ట్ ఇచ్చిన మంత్రి సబితా (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు చిన్నారి విద్యార్థులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా తన కారులో ఎక్కించుకుని ఇంటి వద్ద దించారు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి గొప్ప మనసు చాటుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. వివరాల్లోకి వేళితే.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిన్న మహేశ్వరం మండలం గొల్లురు నుంచి పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ వైపు కాన్వాయ్‌లో వెళ్తున్నారు. ఆ క్రమంలో రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న ఇద్దరు చిన్నారి విద్యార్థులను చూసి కాన్వాయ్ ఆపించారు.

కారులో వస్తారా? అని చిన్నారులను మంత్రి అడగ్గా వెంటనే వారు ఓకే చెప్పారు. దాంతో వారిని మంత్రి తన కారులోనే ఎక్కించుకొని, చాక్లెట్లు అందించి, వారి ఇంటి వద్ద దించారు. కారులో మంత్రి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. నేను పేరు మీకు తెలుసా.. అంటూ చిన్నారులను మంత్రి అడిగారు. నా పేరు సబితమ్మ అని వారికి చెప్పారు. బాగా చదుకోవాలని చిన్నారులకు సూచించారు. అనంతరం వారిని ఇంటి వద్ద దింపిన తర్వాత వారి తల్లిదండ్రులతో మంత్రి కాసేపు మాట్లాడారు. అయితే, మంత్రి తమ గ్రామానికి, తమ ఇళ్లకు రావడంతో ఆ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

వీడియో కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://www.youtube.com/shorts/UxrPWc1kUiA

Advertisement

Next Story