- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడొద్దు: మంత్రి సబితా కీలక సూచన
దిశ, తెలంగాణ బ్యూరో: ఇంటర్ విద్యార్థులు ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయనో, ఫెయిల్ అయ్యామనో ఆందోళన చేయొద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడొద్దని ఆమె సూచించారు. తల్లిదండ్రులు సైతం విద్యార్థులను మార్కులు తక్కువ వచ్చాయని ఒత్తిడికి గురిచేయొద్దని ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి పలు సూచనలు చేశారు.
అలాగే బుధవారం నుంచి ఎంసెట్ పరీక్ష ప్రారంభం కానుందని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఆమె కోరారు. ఎంసెట్‌లో ఇంటర్ వేయిటేజీ లేదు కాబట్టి విద్యార్థులు ఈ రిజల్ట్‌ను పట్టించుకోవద్దని ఆమె సూచించారు. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ టర్నింగ్ పాయింట్ అని ఆమె అన్నారు.
ఇంటర్ బోర్డు కార్యరదర్శి నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. బుధవారం నుంచి రీ కౌంటింగ్, వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. జూన్ 4వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి కలర్ ప్రింట్ మెమోలను విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.