రాజకీయ కక్ష సాధింపే.. చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి పువ్వాడ అజయ్ స్పందన

by Javid Pasha |   ( Updated:2023-09-14 11:19:47.0  )
రాజకీయ కక్ష సాధింపే.. చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి పువ్వాడ అజయ్ స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తెలంగాణ నేతలు కూడా స్పందిస్తున్నారు. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు స్పందించగా... కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అరెస్ట్‌ను ఖండించారు. ఇక టీ బీజేపీ నుంచి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ కూడా బాబు అరెస్ట్‌ను ఖండించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని, రాజకీయ కక్ష సాధింపే కారణమని పేర్కొన్నారు.

అయితే తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన ఆయన.. గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం సరికాదని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే బాబును అరెస్ట్ చేశారని, ఇది మంచి పద్దతి కాదని చెప్పారు. సీఎంగా ఉన్న సమయంలో అనేక నిర్ణయాలు తీసుకుంటారని, ఇప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం సరైన పద్దతి కాదని పువ్వాడ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story