- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘బీఆర్‌ఎస్ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలి’..మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మంగళవారం అసెంబ్లీ సమావేశం వాడి వేడిగా జరిగింది. తాజాగా నేడు (బుధవారం) జరిగిన అసెంబ్లీ సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణం సంబంధించి కావాలని కొన్ని వీడియోలు సృష్టిస్తున్నారని ఫైరయ్యారు. ఈక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా వస్తున్న వీడియోలను విచారించాలని ఆయన కోరారు. హుజురాబాద్ నుంచి జమ్మికుంటకు వెళ్తున్న బస్సులో వెల్లుల్లి పాయలు తీసుకుంటూ వెళ్తున్నారని వీడియోలు తీసి ప్రచార మాధ్యమాల్లో పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఇప్పటివరకు ఆర్టీసీ బస్సుల్లో డెబ్బై కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులకు మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయడం ఇష్టం ఉందా? లేదా? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు.